Header Banner

చిక్కుల్లో ఏఆర్ రెహమాన్! కాపీ రైట్స్ ఇష్యూలో భారీ జరిమానా!

  Sun Apr 27, 2025 14:21        Cinemas

చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈయన 1992లో 'రోజా' సినిమాతో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించారు రెహమాన్. ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించి, సంగీత రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. 19 ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్టా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం, రెండు ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డు రెండుసార్లు గెలిచిన తొలి భారతీయుడుగా కూడా నిలిచారు.

 

కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏ.ఆర్ రెహమాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ - 2' చిత్రంలోని "వీరా రాజా వీరా" అనే పాటలో కాపీరైట్ జరిగిందన్న ఆరోపణలపై కోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లు పిటిషన్ దారుడికి చెల్లించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: స్టార్ నిర్మాతలతో పవన్ కల్యాణ్ అత్యవసర భేటీ..! ఆ సినిమాలకి షెడ్యూల్ ఫిక్స్!

 

"వీరా రాజా వీరా" పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన 'శివ స్తుతి' నుంచి మేపుతూ రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు సాధించిన రెహమాన్‌కు కాపీరైట్ ఇష్యూలో ఫైన్ పడడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.

 


"వీరా రాజా వీరా" పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన 'శివ స్తుతి' నుంచి మేపుతూ రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు సాధించిన రెహమాన్‌కు కాపీరైట్ ఇష్యూలో ఫైన్ పడడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #arrahman #copyrightissue #musiccontroversy #2crorefine #entertainmentnews